America Abbayi (1987)


చిత్రం: అమెరికా అబ్బాయి (1987)సంగీతం: సాలూరి రాజేశ్వరరావుసాహిత్యం: సినారెగానం: బాలు, సుశీలనటీనటులు: రాజశేఖర్, రాధిక, అశ్వనిదర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావునిర్మాత: దుక్కిపాటి మధుసూదనరావువిడుదల తేది: 23.01.1987

చిత్రం: అమెరికా అబ్బాయి (1987)సంగీతం: సాలూరి రాజేశ్వరరావుసాహిత్యం: సినారెగానం: బాలు, సుశీల

నీవు బొమ్మవా – ఉహూ…ముద్దు గుమ్మవా – ఊహూ హు హు….మనసు దోచే మరుమల్లె కొమ్మవాఅహా…అహా…ఆ… అహహాహా…
పల్లవి:పలుకవా ప్రియా ప్రియా తెలుపవా ప్రియా ప్రియావలపు వీణలు మీటిన క్షణంమలుపు తిరుగును జీవిన పధంనీవో సగం నేనో సగం ఒకటే జీవితం
పలుకవా ప్రియా ప్రియా తెలుపవా ప్రియా ప్రియావలపు వీణలు మీటిన క్షణంమలుపు తిరుగును జీవిన పధంనీవో సగం నేనో సగం ఒకటే జీవితంపలుకవా ప్రియా ప్రియా తెలుపవా ప్రియా ప్రియా
చరణం: 1నీవెవరో ఊర్వశివి మురిపించే ప్రేయసివితలపులలో మెరిశావు నా మదిలో వెలిశావుసన్నిధిలో సరాగాలు పెన్నిధిగా ప్రసాదించుసన్నిధిలో సరాగాలు పెన్నిధిగా ప్రసాదించుఆశా రధం సాగే రిథం నీవే తెలుపవాపలుకవా ప్రియా ప్రియా తెలుపవా ప్రియా ప్రియా
చరణం: 2కదలని నీ కన్నులలో కళలెన్నో కన్నానుముసిముసి నీ నవ్వులలో గుసగుసలే విన్నానుపచ్చని కల ఫలించాలి వెచ్చని జత సుఖించాలిపచ్చని కల ఫలించాలి వెచ్చని జత సుఖించాలి మన ఈ కథ.. మమతల సుధా చెలిమే సంపదా
పలుకవా ప్రియా ప్రియా తెలుపవా ప్రియా ప్రియావలపు వీణలు మీటిన క్షణంమలుపు తిరుగును జీవిన పధంనీవో సగం… నీవో సగం.. ఒకటే జీవితం..పలుకవా ప్రియా ప్రియా తెలుపవా ప్రియా ప్రియాపలుకవా ప్రియా ప్రియా తెలుపవా ప్రియా ప్రియాలలలాలల లలాలలాలాల్లా

******* ******* *******

చిత్రం: అమెరికా అబ్బాయి (1987)సంగీతం: సాలూరి రాజేశ్వరరావుసాహిత్యం: సినారెగానం: సుశీల
పల్లవి:ఏ దేశమేగినా ఎందుకాలిడినాఏ దేశమేగినా ఎందుకాలిడినాఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనాపొగడరా నీ తల్లి భూమి భారతినినిలుపరా నీ జాతి నిండు గౌరవమూ
రాయప్రోలన్నాడు ఆనాడూఅది మరిచిపోవద్దు ఏనాడూ
చరణం: 1పుట్టింది నీ మట్టిలో సీతరూపు కట్టింది దివ్య భగవద్గీతవేదాల వెలసినా ధరణిరావేదాల వెలసినా ధరణిరాఓంకార నాదాలు పలికినా అవనిరాఎన్నెన్నొ దేశాలు కన్ను తెరవని నాడువికసించె మననేల విజ్ఞాన కిరణాలు
ఏ దేశమేగినా ఎందుకాలిడినాఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనాపొగడరా నీ తల్లి భూమి భారతినినిలుపరా నీ జాతి నిండు గౌరవమూ
చరణం: 2వెన్నెలదీ ఏ మతమురాకోకిలదీ ఏ కులమురాగాలికి ఏ భాష ఉందిరానీటికి ఏ ప్రాంతముందిరా
గాలికీ నీటికీ లేవు భేధాలూమనుషుల్లో ఎందుకీ తగాదాలు కులమత విభేదాలూ
ఏ దేశమేగినా… ఎందుకాలిడినాఏ పీఠమెక్కినా… ఎవ్వరెదురైనాపొగడరా నీ తల్లి భూమి భారతినినిలుపరా నీ జాతి నిండు గౌరవమూ
చరణం: 3గౌతమ బుధ్ధుని బోధలు మరవద్దూగాంధీ చూపిన మార్గం విడవద్దూగౌతమ బుధ్ధుని బోధలు మరవద్దూగాంధీ చూపిన మార్గం విడవద్దూ
ద్వేషాల చీకట్లూ తొలగించూస్నేహ దీపాలు ఇంటింటా వెలిగించూఐకమత్యమే జాతికి శ్రీరామ రక్షాఅందుకే నిరంతరం సాగాలి దీక్షాఅందుకే నిరంతరం సాగాలి దీక్షా






LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here