మాతృదేవోభవ అన్న సూక్తి మరిచాను – తెలుగు పాటల తోరణాలు

మాతృదేవోభవ అన్న సూక్తి మరిచాను
పితృదేవోభవ అన్న మాట విడిచాను
నా పైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా
నే చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా
అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది
నాన్న అని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నది
అమ్మా… నాన్నా… అమ్మా… ||అమ్మా ఒకసారి||

అమ్మా నీ కలలే నా కంటిపాపలయినవని లాలి జోలాలి
నీ ప్రాణం పనంపెట్టి నాకు పురుడు పోశావని
నీ నెత్తుటి ముద్దయే నా అందమయిన దేహమని
బిడ్డ బతుకు దీపానికి తల్లి పాలే చమురని
తెలియనైతి తల్లీ, ఎరుగనైతిని అమ్మా
కడుపు తీపినే హేళన చేసిన జులాయిని
కన్న పేగుముడిని తెంపివేసిన కసాయిని
మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా
కలనైనా నన్ను కరుణించొద్దు నాన్నా

నాన్నా నీ గుండెపైన నడక నేర్చుకున్నానని
నీ చూపుడు వేలుతో లోకాన్నే చూశానని
నాన్నను పూజిస్తే ఆదిదేవునకు అది అందునని
అమ్మకు బ్రహ్మకు మధ్య నాన్నే ఒక నిచ్చెనని
తెలియనైతి తండ్రీ ఎరుగనైతి నాన్నా
నాన్నంటే నడీచే దేవాలయమని మరిచితిని
ఆత్మజ్యోతిని చేజేతులా ఆర్పివేసుకొంటిని
మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా
కలనైనా నను కరుణించొద్దు నాన్నా||2||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here